Andhra Pradesh: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత.. మనకు తెలియని వ్యక్తులతోనూ కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిచయాల్లో కొన్ని స్పేహనికి దారితీయగా.. మరికొన్ని ప్రేమకు.. మరికొన్ని పెళ్లిళ్లకు దారితీస్తున్నాయి. అసలు ముఖ పరిచయం లేని వ్యక్తులు కూడా సోషల్ మీడియా పరిచయంతోనే ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులతో స్నేహం చేసి మోసపోయిన ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రేమ విహహం చేసుకున్న ఓ జంట తమకు రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు.
సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పరచుకున్న వీరిద్దరూ.. ప్రేమ వివాహం చేసుకున్నారు. విజయవాడ రాజీవ్ నగర్ కు చెందిన యువతి కి ఇబ్రహీంపట్నం ఫెర్రీకి చెందిన యువకుడితో ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ జూపూడిలోని శ్రీవెంకటేశ్వర స్వామి గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ ప్రేమ వివాహన్ని రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమవివాహం చేసుకున్నామని.. తమకు రక్షణ కావాలంటూ ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది ప్రేమ జంట.
మరిన్ని వార్తల కోసం చూడండి..