స్వతంత్ర, వెబ్ డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది. రేపు ప్రధాని మోదీతోనూ చంద్రబాబు భేటీ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో బీజేపీ-టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు బీజేపీ పెద్దలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీల అనంతరం పొత్తులపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.