అంబేద్కర్ కోనసీమ జిల్లా కూటమిలో కుంపటి రగులుతోందా..?, టీడీపీ, బీజేపీ, జనసేన నేతల మధ్య అస్సలు పొసగడం లేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే నిజమేనని చెప్పక తప్పదు. మరి ఎందుకా విబేధాలు..? కూటమి కుంపటికి కారణాలేంటి..? ప్రతిపక్ష కూటమిలో అసలేం జరుగుతోంది..?
అంబేద్కర్ కోనసీమ జిల్లా కూటమిలో కుంపటి రగులుతోంది. జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష కూట మి నాయకుల మధ్య వ్యతిరేకత పెరుగుతోంది. సీట్ల పంపకాల కోసం ప్రారంభమైన విబేధాలు.. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా సద్దుమణగడం లేదు. దీంతో నేతల తీరు అధినేత లకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా జనసేన నుంచి వ్యతిరేక గళం వినిపిస్తోంది. ఆ పార్టీకి ఆశించిన మేర సీట్లు దక్కకపోవడమే అందుకు కారణం. జిల్లా కేంద్రమైన అమలాపురంతో సహా మూడు స్ధానాల నుంచి పోటీ చేయాలని జనసైనికులు పట్టు పట్టారు. కానీ,.. అందుకు విరుద్ధం గా నిర్ణయం జరగడంతో అసంతృప్తిలో ఉన్నారు ఆ పార్టీ శ్రేణులు. అమలాపురం స్ధానం నుంచి పోటీ చేయాల్సిందేనని జనసేన పట్టు పట్టింది. ఇందుకోసం గ్రూపు విబేధాలు పక్కన పెట్టి మరీ రోడ్డెక్కారు పార్టీ శ్రేణులు. అయితే,.. వారి ఇష్టాని కి విరుద్ధంగా అమలాపురం స్థానం టికెట్‌ను టీడీపీకి కేటాయించారు. దీంతో ఇక్కడి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల నుంచి వ్యతిరేకత వస్తోంది. పైకి కలిసి ఉన్నట్టే కనిపిస్తున్నా.. అంతర్గతంగా విబేధాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే తెలుగు దేశం అభ్యర్థి ఆనంద రావుకు జనసేన నుంచి ఎలాంటి సహాకారం అందడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మరోపక్క జనసేన నాయకుడైన శెట్టిబత్తుల రాజాబాబు పార్టీకి రాజీనామా చేయడంతో జనసైని కులెవరూ ముందుకు రావడం లేదు. ఒకరిద్దరు కనిపించినా.. వారు కూడా మమ అనిపించి వెళ్లిపోతు న్నారు తప్ప ప్రచారంలో పాల్గొనడం లేదు.
ఇక తాజాగా అమలాపురంలో నిర్వహించిన మూడు పార్టీల కూటమి సమన్వయ సమావేశానికి ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే హాజరవడం చర్చకు దారి తీసింది. వారు కూడా టీడీపీ అభ్యర్థులు మాత్రమే కావడం గమనార్హం. జిల్లాలో జనసేన నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్ధులైన గిడ్డి సత్యనారాయణ, దేవా వరప్రసాద్ సమావేశానికి రాకపోవడమే కాదు… కూటమికి చెందిన నాయకులతో కలిసి నడవడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక కొత్తపేటలో టిక్కట్ ఆశించిన జనసేన నాయకుడు బండారు శ్రీనివాస్ తన అన్న సత్యానందరావుకు టీడీపీ టిక్కట్ దక్కడంతో ముందు అలిగారు. తర్వాత కలిసి పని చేస్తామని చెప్పినా ఆ జాడలు మాత్రం కనిపించడం లేదు. మండపేట, ముమ్మిడివరం నియోజవర్గాల్లో అయితే జనసేన లేనట్లుగానే ఉంది పరిస్ధితి. ముమ్ముడివరం నుంచి జనసేన టిక్కట్ ఆశించి భంగపడ్డ పితాని బాలకృష్ణ వైసీపీ గూటికి చేరిపోయారు. దీంతో ఇక్కడి జనసైనికులు టీడీపీ అభ్యర్ధి దాట్ల రాజు ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు.
మండపేటలో జనసేన టిక్కట్ ఆశించిన వేగుళ్ల లీలాకృష్ణ కూడా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబ ఒకరోజు పర్యటన కోసం జిల్లాకు వచ్చినప్పుడు కూడా గన్నవరం జనసేన అభ్యర్ధి గిడ్డి సత్యనారాయణ తప్ప ఆ సమావేశానికి ఎవరూ వెళ్లలేదు. రామచంద్రపురంలో టీడీపీ అభ్యర్ధి వాసంశెట్టి సుభాష్‌కు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. అక్కడ టిక్కట్ ఆశించిన నాయకు లెవరూ పెద్దగా ప్రచారాన్ని పట్టించుకోవడం లేదు. జనసేన శ్రేణులు కూడా అంటీ ముట్టనట్టుగా వ్యవహరి స్తున్నట్టు సమాచారం. ఇక మూడు పార్టీల్లో ఒక్కటైన బీజేపీ నాయకులు కూడా ఒకింత అసంతృప్తిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. గన్నవరం బీజేపీకి కేటాయిస్తారని ఆశపడ్డారు కమలనాథులు. అయితే, అది కాస్తా జనసేనకు ఇవ్వడంతో బీజేపీ శ్రేణుల్లో నిరాశ పెరిగింది. దీంతో వారు కూడా ఏదో తప్పదన్నట్టుగా అప్పుడ ప్పుడు కనిపించడం తప్ప… విజయం కోసం తపిస్తున్నట్టుగా పని తీరు లేదన్న విమర్శ వినిపిస్తోంది. ఎన్నికల తేదీ దగ్గరపడు తున్న కొద్దీ సమయం లేదు మిత్రమా అంటూ పరుగులు పెట్టాల్సిన ప్రతిపక్ష కూటమి నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పొత్తు ధర్మాన్ని లెక్క చేయడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుందని. . కూటమి మూడు ముక్కలవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇకనైనా అధినేతలు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దు తారా…? వారి మాటను క్యాడర్ లెక్క చేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.


