24 C
Hyderabad
Tuesday, August 26, 2025
spot_img

తెలుగు సినీ సెలబ్రిటీలపై నోరు పారేసుకున్న అంబటి రాయుడు

తెలుగు సినీ సెలబ్రెటీల మీద మాజీ క్రికెటర్ , కామెంటేటర్ అంబటి రాయుడు నోరుపారేసుకున్నాడు. దుబాయ్‌ వేదికగా జరిగిన ఛాంపియన్‌ ట్రోఫీలో దాయాదుల పోరులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి జట్టును మట్టికరిపించిన భారత్‌ మరోసారి పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు చాలా మంది సెలబ్రిటీలు దుబాయ్‌ చేరుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి దుబాయ్‌ స్టేడియంలో సందడి చేశారు.

భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటేనే స్టేడియం కిక్కిరిసిపోతుంది. ఇక ఆదివారం దుబాయ్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ ఈ సందడే కనిపించింది. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి అయితే మెగాస్టార్‌ చిరంజీవి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ , దర్శకుడు సుకుమార్‌ స్టేడియంలో సందడి చేశారు.

దుబాయ్ – వేదికగా జరిగిన భారత్ పాకిస్ధాన్ మ్యాచ్ కు కామెంటేటర్ గా అంబటి రాయుడు వ్యవహరించాడు. భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్ స్టేడియంలో కనిపించారు. వీరి మీద అంబటి రాయుడు విమర్శలు చేశాడు. టీవీల్లో కనిపించాలనే మ్యాచ్ చూసేందుకు వచ్చారని కామెంటేటర్ అంబటి రాయుడు వ్యాఖ్యలు చేయడం హాట్‌ టాపిక్‌ అయింది. పబ్లిసిటీ స్టంట్ లో భాగంగానే మ్యాచ్ చూసేందుకు తెలుగు సెలబ్రిటీలు వస్తారని అన్నారు.

ఇక అంబటి రాయుడు కామెంట్స్ కు తోటి తెలుగు కామెంటేటర్స్ కూడా వత్తాసు పలికారు. దీంతో కామెంటేటర్స్‌పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ మీద ఉన్న అభిమానం కొద్దీ.. అందులోనూ భారత్‌- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ కాబట్టి సెలబ్రిటీలు రావడంలో తప్పేంటని… ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో అర్ధం లేదని అంటున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్