స్వతంత్ర వెబ్ డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ యువనేత నారా లోకేశ్ కలిసిన సంగతి తెలిసిందే. నిన్న సీఐడీ విచారణ ముగిసిన వెంటనే ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి నిన్న రాత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా అక్కడ తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, పురందేశ్వరి కూడా ఉన్నారు. తమపై నమోదైన కేసుల గురించి ఈ సమావేశంలో అమిత్ షాకు లోకేశ్ వివరించారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైరిక్ గా ట్వీట్ చేశారు. అమిత్ షాను కలిసింది బీజేపీలో విలీనం కావడానికేగా? అని ఎద్దేవా చేశారు.