24.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ నుంచి రేపు మెలోడీ సాంగ్ రాబోతోంది!

సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘గుమ్మా..’ ప్రోమోను ఇవాళ రిలీజ్ చేశారు. ఫుల్ లిరికల్ సాంగ్ ను ఈ నెల 30న విడుదల చేయబోతున్నారు.

‘గుమ్మా..’ సాంగ్ కు రెహ్మాన్ లిరిక్స్ అందించగా…శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించి పాడారు. ఎట్టా ఎట్టనే ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటు గుండె డప్పు కొట్టెనే..సుట్టూ పక్కల సూసేది ఎట్టనే పట్టలేని మైకమేదో నన్ను సుట్టెనే అంటూ క్యాచీ కంపోజిషన్ తో ఆకట్టుకుందీ సాంగ్ ప్రోమో. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న”అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉంది. త్వరలోనే థియేటర్స్ ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

నటీనటులు – సుహాస్, శివాని నాగరం, శరణ్య ప్రదీప్,జబర్దస్త్ ప్రతాప్ భండారి, గోపరాజు రమణ తదితరులు

టెక్నికల్ టీమ్ –

సంగీతం – శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్,
ఎడిటింగ్ – కొదాటి పవన్ కల్యాణ్
పీఆర్వో – జీఎస్ కే మీడియా, ఏలూరు శ్రీను
బ్యానర్స్ – జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
రచన దర్శకత్వం – దుశ్యంత్ కటికినేని

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్