28.2 C
Hyderabad
Friday, December 1, 2023
spot_img

ఏపీలో రాజధాని అంశమే కీలకంగా మారనుందా?

ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాజధానుల అంశమే కీలకం కానుందా? రాజధాని లేకుండా చేశారన్న నినాదాన్ని టీడీపీ ఆయుధంగా మలుచుకోవాలని చూస్తోందా? అమరావతికి పరిమితమైన టీడీపీని రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో విలన్ గా చూపించడానికి పాలక పక్షం పావులు కదుపుతోందా? ఎవరి ఆలోచనలు ఎలా ఉండచ్చు? స్వతంత్ర ప్రత్యేక కథనం

విభజన అనంతరం ఏపీకి రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. వాళ్లు పలుమార్లు తిరిగారు. అప్పటికే ఉన్న శ్రీకృష్ణ కమిటీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్నీ చూసి ఒక నివేదికను సమర్పించారు.

2014లో జనసేన-బీజేపీ మోపుతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అప్పుడు శివరామకృష్ణన్ నివేదికను దిండు కింద పెట్టి తన మనసులో కొలువైన అమరావతిలో కొత్త రాజధానికి ప్లాన్ చేశారు. దాన్ని అమలు చేసేందుకు నారాయణ కమిటీని వేశారు.

రాజు మనసెరిగిన మంత్రి.. అమరావతే రాజధానిగా కరెక్ట్ అని నివేదిక ఇచ్చారు. ఆలస్యం లేకుండా ప్రధాని మోదీతో గుమ్మడికాయ కొట్టించారు. అపర రాజకీయ మేధావిగా పేరు పొందిన మోదీ ఆనాడే ఊహించి నట్టున్నారు…అందుకే గంగాజలం, మట్టి తీసుకువచ్చి చివరికి ఏపీ ప్రజలకు మిగిలేది? ఇదేనని చెప్పకనే చెప్పారు.

రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవని, చంద్రబాబు ప్రజలనే అడిగారు. అమరావతి ఇటుక మీద మీ పేరు ఉంటుందన్నారు. ఇలా వారినీ ఇన్ వాల్వ్ చేశారు. భూములు కొనడానికి డబ్బుల్లేవని, రైతులను లాగారు. వారి దగ్గర వేలాది ఎకరాల భూములు తీసుకున్నారు. ఇంతా చేసి శాస్వత భవనాలేవీ కట్టకుండా గ్రాఫిక్స్, డిజైన్లపైనే ఆధారపడ్డారు. ఆఖరికి ప్రముఖ దర్శకుడు రాజమౌళిని కూడా తీసుకువచ్చి, మాహిష్మతీ సామ్రాజ్యంలా ఉండాలని కోరారు. అలా అయిదేళ్లూ కాలక్షేపం అయిపోయింది.

2019 ఎన్నికల్లో అమరావతి కాన్సెప్ట్ అట్టర్ ప్లాఫ్ అయి, 23 సీట్లకే పరిమితమయ్యారని అంతా అనుకున్నారు. చివరికి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. జగన్ సీఎం అయ్యారు.

ఒకసారి అమరావతి కాన్సెప్ట్ తో ఐదేళ్లు చేసిన ప్రయత్నం వృథా అయినా సరే, దానినే మళ్లీ చంద్రబాబు ఆయుధంగా మలచుకుంటున్నారా? అనేది సామాన్య జనానికి అంతు చిక్కకుండా ఉంది. మరోవైపు సీఎం జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపి, ప్రజల సెంటిమెంట్ ను వాడుకున్నారు.

అదెలా అంటే హైదరాబాద్ ని డవలప్ చేసి, తెలంగాణావారి చేతిలో పెట్టాం. మళ్లీ ఆ తప్పిదం చేయకూడదు. ఇది అందరి మదిలో ఉంది. అంతేకాదు ఒకే చోట పెట్టుబడులు పెడితే వేర్పాటువాద రాజకీయాలు మొదలవుతాయి, అందుకని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని భావించి మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకువచ్చారు.

ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దాని  సిఫారసుల ప్రకారం అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా,  కర్నూలు న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ఈ నిర్ణయంతో చంద్రబాబులో కంగారు మొదలైంది. అమరావతిని మార్చడానికి వీల్లేదంటూ ఉద్యమించారు. అమరావతి రైతులతో కేసులు వేయించారు. ఈ రెండు వాదనల మధ్యలో రైతులు నలిగిపోతున్నారు. అయితే అమరావతి ప్రాంతంలో రైతుల ముసుగులో ఉన్న వారంతా టీడీపీ నేతల బినామీలేనని ప్రభుత్వం ఆరోపించింది. దానిపై దర్యాప్తుకు సిట్ ను నియమించింది కూడా. అయితే హైకోర్టు స్టే విధించడంతో సిట్ దర్యాప్తు ఆగిపోయింది.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఇంత వ్యతిరేకత ఉందని చెబుతున్న ‘చంద్రబాబ్ అండ్ కో’ కి మైండ్ బ్లాక్ అయ్యేలా అమరావతి ప్రాంతంలో వైసీపీ హవా నడిచింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ,మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించింది. అలా మూడు రాజధానులకు ఆమోద ముద్ర పడినట్లు ప్రభుత్వం భావించింది.

అయి ప్రజా కోర్టులో మాత్రం ఓ సెంటిమెంట్ రాజుకుంటోంది. 29 గ్రామాలతో కూడిన అమరావతిలోనే చంద్రబాబు లక్షల కోట్లు ఖర్చు చేయమంటున్నారని, తాము వేలాది గ్రామాలతో కూడిన యావత్ రాష్ట్రాన్ని సమానంగా అభివృద్ది చేయాలనుకుంటున్నామని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. 

ఒక్క ప్రాంతంపై ఇంత ఖర్చు చేస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేసినట్లు కాదా అని నిలదీస్తోంది. ఇది రాను రాను చంద్రబాబు ఒకే ప్రాంతానికి పరిమితం అవుతున్నారన్న సంకేతాన్ని ప్రజల్లోకి చేరుస్తోంది. ఇది ఎన్నికల్లో ఇరుపార్టీలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందోనని సర్వత్రా ఆసక్తి మొదలైంది.

Latest Articles

‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్

అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్