25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

అల్లుడా మజాకా.. అర్థరాత్రి అత్తింటికి నిప్పు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. ఎంత పెద్ద గొడవనా 10 నిమిషాలు కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే కొందరు దంపతులు విచక్షణ మరిచిపోతున్నారు. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు. వనపర్తి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. భార్యతో గొడవపెట్టుకున్న ఓ వక్తి.. ఆమెపై కోపంతో అత్తింటికి నిప్పు (Fire) పెట్టాడు. లక్కీగా ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం(Killaghanapuram) మండల కేంద్రానికి చెందిన చిన్న భద్రయ్య, మణెమ్మ దంపతులకు కూతురు లక్ష్మి సంతానం. లక్ష్మిని అదే గ్రామానికి చెందిన పొయ్యికాటి శివయ్యకు ఇచ్చి 14 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. వారికి ఓ కుమారుడు. అయితే గత మూడేళ్లుగా శివయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు మెుదలయ్యాయి. లక్ష్మి అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. గత కొంతకాలంగా ఆమె పుట్టింట్లోనే ఉంటుంది. తన భార్యను కాపురానికి పంపించాలంటూ శివయ్య అత్తవారింటికి వచ్చి తరుచూ గొడవ పడేవారు.

లక్ష్మి మాత్రం కాపురానికి రానని తెగేసి చెప్పింది. తల్లిదండ్రులు కూడా కూతురుకే వత్తాసు పలికారు. దీంతో శివయ్య అత్తింటిపై కోపం పెంచుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. అత్తింటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు సకాలంలో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భార్య లక్ష్మి, అత్త మామల ఫిర్యాదు మేరకు శివయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్