ఏరువాక అనగానే రంకెలేసే బసవన్నల సందడి, అందంగా అలంకరించిన ఎద్దులు, వాటికి ప్రత్యేక పూజలు గుర్తొస్తాయి. కానీ ఇందుకు వినూత్నంగా కర్నూలు జిల్లాలో సినీ స్టార్లు గుర్తొస్తారు. మరి దుక్కి దున్ని అన్నదాతకు చేదోడుగా నిలిచే బసవన్నల పండుగలో సినీస్టార్ల ముచ్చటేంటి..? ఆ వేడుక ప్రత్యేక తేంటి.? ఓసారి చూసేద్దామా.
వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం. అందుకే ప్రకృతిని ఆరాధించే మన సంప్రదాయంలో భూమిని భూమా తగా కొలుస్తూ వ్యవసాయ పండుగలకు ప్రాముఖ్యతనిస్తాం. అలాంటి పండుగలలో ఏరు వాక ఒకటి. తొలకరి జల్లులతో అన్నదాత దేశానికి అన్నం పెట్టేందుకు సన్నద్ధమైన వేళ.. వ్యవసా యానికి చేదోడుగా నిలిచే బసవన్నలను పూజిస్తూ వేడుక జరుపుతారు. అందంగా అలంకరించి వాటికి నైవేద్యం సమరిస్తారు. ఇలా పేర్లు వేరైనా దేశవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం వినూత్నంగా సినీస్టార్ల వేషాధారణతో సంబరా లు చేసుకున్నారు. ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో ఏరువాక పండుగ అత్యంత వైభవంగా జరిగింది. ఉద యాన్నే బసవన్న లకు స్నానాలు చేయించి, చూడముచ్చటగా ప్రత్యేకంగా అలంకరించారు. పొలంలో పూజల అనంతరం సాయంత్రం పూట పారువేట పోటీలు నిర్వహించారు. ఈ సమయంలో ఊర్లోని యువకుల వేషాధారణ అందరినీ ఆకట్టుకుంటుంది. తమ అభిమాన హీరో గెటప్‌లో వచ్చి జనాన్ని అలరించారు. పండుగ సంద డిని మరింత పెంచుతారు. యువకులు మాత్రమే కాదు. బుడతలు కూడా ఈ గెటప్స్‌లో అదిరిపోయారు. ఇక ఎప్పటిలాగే ఏరువాక వేళ ఈసారి కూడా హీరోల్లా ఫోజులు కొట్టారు యువకులు.
ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్న గేమ్ చేంజర్ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఒక పాటలో రామ్ చరణ్ వేసిన వేషధారణతో ఓ యువకుడు రాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప2 గెటప్‌తో మరొకరు సంద డి చేశారు. ప్లాస్టిక్ సంచులతో దుస్తులు డిజైన్ చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రం వేశాధారణ కూడా అందరినీ అలరించింది. తమ హీరోల వేశాధారణలతో ఊరంతా చుట్టేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. అన్ని పండుగల కంటే కూడా ఏరువాక కన్నుల పండుగగా నిర్వహిస్తామని తెలిపారు గ్రామ పెద్దలు. చుట్టు పక్కల యువకులు ఉత్సాహంతో తరలివచ్చి తమ అభిమానుల వేధాధారణతో అందరినీ అలరించడంతో జాతరను తలపిస్తుందన్నారు. తమ గ్రామం లో ప్రత్యేకంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని చూసేందుకు చుట్టు పక్కల నుంచి జనం తరలివస్తారని తెలి పారు. చూశారుగా వినూత్నంగా, ప్రత్యేకంగా జరుపుకున్న ఏరువాక పండుగని. మరి పండుగ ఎలా జరుపుకున్నా దేశానికి అన్నం పెట్టే రైతును మరువొద్దు. మట్టి మనిషి బురద చిందిస్తేనే. మన నోట్లోకి నాలుగు మెతుకులు పోతాయన్నది గుర్తుంచుకుందాం. రైతును గౌరవిద్దాం. మన సంస్కృతి, సంప్రదా యాలకు విలువనిస్తూ వాటిని భవిష్యత్ తరాలకు అందిద్దాం.