చిత్ర సీమకు కాంగ్రెస్‌కు విడదీయని బంధం ఉందన్నారు TPCC చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్. అల్లు అర్జున్ వ్యవహారం ముగిసిన అధ్యాయమన్నారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ నాయకులు వారి అవసరాలకు వాడుకుంటున్నారని అన్నారు. సంధ్య ధియేటర్ ఘటన బీజేపీ, BRSతో పాటు.. ఆంధ్ర పార్టీలు కూడా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో చిత్ర సీమను అభివృద్ధి చేయాలనే వెసులుబాటు ప్రభుత్వం ఇస్తుందన్నారు.
ఎమ్మెల్సీ కవితకు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. పీవీ నరసింహా రావు కాంగ్రెస్ ఆస్తి అన్నారు. పీవీ రాజకీయ పరిణితి గుర్తించింది కాంగ్రెస్ అని చెప్పారు. పీవీ జ్ఞాన భూమికి కాంగ్రెస్ హయంలో జివో ఇచ్చామని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చోరవతో పీవీ దహన సంస్కరణలు కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.