24.5 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

Ugram Trailer| ఉగ్రరూపం చూపించిన అల్లరి నరేశ్

హీరో అల్లరి నరేశ్ సరికొత్త పంథాలో దూసుకుపోతున్నాడు. మొన్నటి దాకా కామెడీ చిత్రాలతో మూస పద్థతిలో వెళ్లిన నరేశ్.. ఇప్పుడు గేర్ మార్చాడు. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రాల్లో పరిణీతి చెందిన నటనతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు అదే కోవలో నాంది దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటూ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమా టైటిల్ కు తగ్గట్లే నటనలో నరేశ్ ఉగ్రరూపం చూపించాడు. సెక్స్ రాకెట్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. తన భార్య, కూతురితో పాటు సెక్స్ రాకెట్ మాఫియా బారిన పడిన మహిళలను ఓ పోలీసాఫీసర్ ఎలా రక్షించాడు? ఆ ముఠాను ఎలా అంతం చేశాడనేది దర్శకుడు ఎంతో ఉత్కంఠగా చూపించాడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం మే5న విడుదల కానుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్