హైదరాబాద్ హుస్సేన్ సాగర తీరాన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అంబేడ్కర్ విగ్రహ( Ambedkar Statue) నిర్మాణం పూర్తయ్యింది. ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా ఈ రోజు అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం సీఎం కేసీఆర్(CM KCR) చేతులమీదుగా ప్రారంభం కానుంది.ఇప్పటికే అన్ని ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా అంబేద్కర్ ముని మనవడు ప్రకాష్ అంబేడ్కర్(Prakash Ambedkar) రానున్నారు. భారీ విగ్రహాన్ని రూపొందించిన అంబేడ్కర్ శిల్పి రామ్ వన్ జీ సుతార్ లు ముఖ్య అతిధులుగా పాల్గొననున్నారు. ఈ విగ్రహ తయారీకి 112 టన్నుల కాంస్యం, 353 టన్నుల ఉక్కుతో 125 అడుగుల ఎత్తుతో అంబేడ్కర్ విగ్రహాన్ని తయారు చేశారు. మొదట లోపల ఉక్కుతో భర్తీ చేసి.. పైన కాంస్యంతో రూపొందించారు. నేటి భారతదేశ పార్లమెంటు ఆకృతిలో రూపొందించిన స్మారక భవనాన్నే బేస్‌మెంట్‌గా చేసుకుని అంబేడ్కర్ విగ్రహాన్ని నిలిపారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు రానున్నారు. సుమారు యాభై వేల మంది విగ్రహావిష్కరణలు తరలి రానున్నట్లు తెలుస్తోంది. .ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మందిని సభకు హాజరు కానున్నారు. ప్రజల తరలింపు కోసం 750 ఆర్టీసీ బస్సులను బుక్ చేయనున్నారు. ప్రారంభోత్సవానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై మంత్రులు సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున అద్భుత దృశ్యం ఆవిష్కరణ కానున్న నేపథ్యంలో నగరంలో వర్షం మొదలయింది. పలుచోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా ట్రాఫిక్ కి ఇబ్బంది కలుగుతుంది. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుండగా.. వర్షం ఇబ్బందిగా మారుతుందని కొందరు అనుకుంటే.. ఇన్నాళ్లకు నా బిడ్దకు గొప్ప కీర్తి దక్కిందని నేలమ్మ తల్లి ఆనంద బాష్పాలు కారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహావిష్కరణ(Ambedkar Statue) నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయా రూట్లలో వచ్చే వాహనాలను దారి మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. నెక్లస్ రోడ్, ఖైరతా బాద్, లక్డికాపూల్, ఎన్టీఆర్ జంక్షన్, తెలుగు తల్లి జంక్షన్ రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పంజాగుట్ట, సోమాజిగూడ ఖైరతాబాద్ నుంచి నెక్లస్ రోడ్వైపు వెళ్లే వాహనాలను షాదన్ కళాశాల మీదుగా దారిమళ్లించారు. సంజీవయ్య పార్కు, నెక్లస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు ఖైరతాబాద్ వైపు వెళ్లేవాహనాలు రాన్ గంజ్ మీదుగా తరలించనున్నారు.
లక్డికాపూల్ నుంచి ట్యాంక్ బండ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ట్యాంక్ బ్యాండ్ వైపు మళ్లింపులు జరిపారు. ట్యాంక్ బండ్, బీఅర్కె భవన్, తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలను లక్డికాపూల్ వైపు మళ్లించనున్నారు. మింట్ కాంపౌండ్, నెక్లస్ రోడ్ మార్గాలు మూసివేయనున్నారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబిని పార్కును మూసివేశారు. ఖైరతాబాద్, సైఫాబాద్, రవీంద్రభారతి, మింట్ కాంపౌండ్, నల్లగుట్ట, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, తెలుగు తల్లి సిగ్నల్ వద్ద భారీ వాహనాలు రద్దీ ఉండే అవకాశం ఉంది. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు దృష్టిలో పెట్టుకొని.. వాహనదారులు ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక రూట్లలో వెళ్లాలని సూచించారు.
Read Also: చీమలపాడు బాధిత కుటుంబంతో ఫోన్ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్
Follow us on: Youtube, Koo, Google News