27.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలి: బెక్కం వేణు

మంచి కథతో వచ్చే చిత్రాలను జనాలు ఆదరిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్నారు. కంటెంట్ కొత్తగా ఉంటే బ్రహ్మరథం పడుతున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్‌ జానర్‌లో వచ్చే చిత్రాలకు ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. అలాంటి ఓ చిత్రమే త్వరలో రాబోతోంది. యంగ్ హీరో దినేష్ తేజ్, అందాల తారలు హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. ఈ సినిమాతో ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇవ్వాలని మేకర్లు ప్రయత్నిస్తున్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్న క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్రయూనిట్. ఈ రోజు సినిమా ట్రైలర్‌ను యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి చిన్న సినిమాలను ఆడియెన్స్ ఎంకరేజ్ చేయాలి.. నిర్మాత సాయి రాజకీయ రంగం నుంచి ఎంతో ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చారు. హుషారు సినిమాకు దర్శకుడు మారేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అప్పుడే నాకు ఈ కథను చెప్పాడు. దినేష్ నటన చాలా బాగుంది. అన్ని అంశాలతో తెరకెక్కించిన కమర్షియల్ చిత్రమిది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

త్రినాథ రావు నక్కిన మాట్లాడుతూ.. ‘మారేష్ చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా ఈ సినిమాను తీశారు . హెబ్బా, పాయల్ అద్భుతంగా చేశారు. లక్కీ మీడియాకు దినేష్ వచ్చినప్పుడే అతను నాకు తెలుసు. ఈ సినిమా రిలీజ్ కాబోతోందని యూనిట్‌లో కనిపిస్తున్న ఆనందం కోసం మేం ఇలా గెస్టులుగా వస్తాం’ అని అన్నారు.

డైరెక్టర్ మారేష్ శివన్ మాట్లాడుతూ.. ‘సినిమా బాగా తీశాను. ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. నేను ఇలా ఇక్కడ ఉండేందుకు కారణం మా నిర్మాత సాయి. సినిమాలోని ఎమోషన్, కథ నచ్చి కొమ్మాలపాటి శ్రీధర్ గారు నిర్మించారు. దినేష్ నాకు ఎంతో సహకరించారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఓ రెండు గంటల పాటు అదే ట్రాన్స్‌లో ఉంటారు. చిన్న సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన బెక్కెం వేణుగోపాల్ గారు, త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గొప్పగా నిర్మించారు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. నా బెస్ట్ ఇచ్చాను. ప్రేక్షకులు మా సినిమాను, టీంను ప్రోత్సహించండి’ అని అన్నారు.

నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ.. ‘ఇది ఫుల్ మీల్స్ లాంటి సినిమా. మంచి చిత్రాన్ని ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. లవ్ స్టోరీలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి. ఈ సినిమాకు దినేష్ రైట్ చాయిస్ అనిపించింది. క్యూట్ లవ్ స్టోరీకి క్యూట్ హీరోయిన్ పాయల్ కరెక్ట్ అనిపించింది. అండర్ కరెంట్‌గా ఓ మెసెజ్ ఉంటుంది. ఆ పాత్రకు హెబ్బా పటేల్ న్యాయం చేసింది. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అనుకున్న టైంకి అనుకున్నట్టుగా సినిమాను తీశాం. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

దినేష్ తేజ్ మాట్లాడుతూ.. ‘గెస్టులుగా వచ్చిన హరి ప్రసాద్ గారు, బెక్కెం వేణుగోపాల్ గారు, త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. మా టీం గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడతాను. ఆకలి మీదున్న వారికి మంచి ఫుల్ మీల్స్ పెడితే ఎలా ఉంటుందో మా సినిమా కూడా అలానే ఉంటుంది. మా ఈ సినిమా అందరికీ ఓ మంచి జ్ఞాపకంగా ఉంటుంది. త్వరలోనే థియేటర్లోకి మా సినిమా రాబోతోంది. చూసి ఆదరించండి’ అని కోరారు.

హరి ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ఎంతో ఫాస్ట్‌గా, అందంగా తీశారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ.. ‘సుభాష్ మాకు హుషారు, 18 పేజీస్ వంటి సినిమాలు చేశారు. ఈ సినిమాలోని పాటలు అందరికీ నచ్చాయి. ట్రైలర్ కూడా బాగుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ సుభాస్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘విజన్ మూవీస్ మాకు హోం బ్యానర్. మంచి ఫీల్ గుడ్ మూవీని దర్శకుడు తీశారు. ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. నాకు ఫస్ట్ సినిమా అయినా కూడా చంద్రబోస్ గారు ఎంతో సహకరించారు’ అని అన్నారు.

హిరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘మా నిర్మాతకు, నాకు ఇది మొదటి చిత్రం. తరగతి గది దాటి అనే వెబ్ సిరీస్‌ను చేశాను. ఇదే నా ఫస్ట్ సినిమా. నా లైన్ క్రాస్ చేసి కాస్త బోల్డ్‌గా నటించాను. దినేష్ నాకు సీనియర్. కానీ ఎంతో కంఫర్టబుల్‌గా కలిసి సినిమా చేశాం. మా సినిమాను అందరూ చూసి విజయవంతం చేయండి’ అని అన్నారు.

కెమెరామెన్ ఆండ్రూ మాట్లాడుతూ.. ‘నిర్మాత సాయి ఎంతో ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఎంతో ఎమోషనల్‌గా ఈ సినిమాను మారేష్ తెరకెక్కించారు. సినిమాను ఆడియెన్స్ సపోర్ట్ చేయాలి’ అని అన్నారు.

Latest Articles

భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా

భారత్‌లో లోక్‌సభ ఎన్నికలపై మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ టెక్‌ దిగ్గజం స్పందించింది. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. ఇది అనుకోకుండా జరిగిన పోరపాటు అని క్షమించాలని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్