27.2 C
Hyderabad
Saturday, December 2, 2023
spot_img

‘మట్టికథ’తో ఇంప్రెస్ చేసిన అజయ్ వేద్

అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో 9 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది ‘మట్టి కథ’. ఈ సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో అజయ్ వేద్. అతని యాక్టింగ్ టాలెంట్, గుడ్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఒక కొత్త ప్రయత్నంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మట్టికథ థియేటర్‌లో చూసిన వారంతా అజయ్ వేద్ యాక్టింగ్ బాగుందని, అతనో ప్రామిసింగ్ టాలెంటెడ్ యాక్టర్ అవుతాడని అప్రిషియేట్ చేస్తున్నారు. మట్టికథ ప్రచార కార్యక్రమాల్లో అజయ్ వేద్ మాట్లాడిన తీరు కూడా నటుడిగా అతనిలోని కాన్ఫిడెన్స్ చూపించింది.

మట్టికథ రిలీజ్ ప్రెస్ మీట్‌లో నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ అజయ్ వేద్ టాలెంట్, పంక్చువాలిటీ, కమిట్ మెంట్ తనను ఆకట్టుకుందని, అతనికి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు. థియేటర్‌లో ఆడియెన్స్‌ను తన యాక్టింగ్‌తో ఇంప్రెస్ చేశాడు అజయ్ వేద్. క్రియేటివ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలనేది తన గోల్‌గా చెబుతున్నాడీ యంగ్ హీరో.

మట్టి కథ సినిమాలో అజయ్ వేద్‌తో పాటు మాయ, కనకవ్వ, దయానంద్ రెడ్డి, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పిరెడ్డి నిర్మించారు. సహనిర్మాత సతీశ్ మంజీర. పవన్ కడియాల దర్శకత్వం వహించారు. మట్టి కథ సినిమా ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మూడు కేటగిరీల్లో అవార్డులతో పాటు 9 అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది.

Latest Articles

‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్

అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్