SRH vs LSG | ఐపీఎల్ తెలుగు టీం సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఈసారి కూడా పేలవ ఫాంను కొనసాగిస్తోంది. ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచుల్లో ఘోరంగా ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో ఉంది. దీంతో నేడు లక్నో సూపర్ జెయింట్స్(Luknow Super Gaints) తో జరిగే మ్యాచులో గెలవాలని పట్టుదలతో ఉంది. ఎందుకంటే హైదరాబాద్ టీంలోకి కెప్టెన్ మార్క్రెమ్, హెన్రీచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్ ఎంటర్ అయ్యారు. దీంతో రైజర్స్ టీం బలంగా కనిపిస్తోంది. అటు లక్నో జట్టులోకి భీకర ఫాంలో ఉన్న క్వింటాన్ డికాక్ వచ్చాడు. దీంతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మరింత స్ట్రాంగ్ కానుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఇరుజట్లు(SRH vs LSG) ఒక్కసారి మాత్రమే తలపడగా.. ఆ మ్యాచులో లక్నో 12 పరుగుల తేడాతో హైదరాబాద్ టీంపై విజయం సాధించింది. కాగా సాయంత్రం 7.30గంటలకు లక్నో వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.
Read Also: బండి సంజయ్ కి కేంద్ర పెద్దల ఫోన్.. గో హెడ్ అంటూ భరోసా
Follow us on: Youtube, Instagram, Google News