భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మారుతి పారా మెడికల్ నర్సింగ్ కాలేజీలో వద్ద ఉద్రిక్తత నెలకొంది. నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతికి నిరసనగా భద్రాచలం పారా మెడికల్ కళాశాల వద్ద విద్యార్థులు, బంధువులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థిని కారుణ్య మృతి తీవ్ర కలకలం రేపింది. ఆమె మృతికి నిరసనగా అఖిలపక్ష సంఘం నాయకులు, బంధువులు ర్యాలీ చేపట్టారు. అనంతరం కాలేజీ ముందు ధర్నా చేశారు. కాలేజీ సీజ్ చేసి, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే మృతురాలి బంధు వులు కాలేజీ యాజమాన్యంపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయా లని డిమాండ్ చేశారు. కళాశాలకు వచ్చిన ఛైర్మన్‌పై దాడికి విద్యార్థులు, బంధువులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.