‘ఉపేంద్రగాడి అడ్డా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కంచర్ల ఉపేంద్ర కథానాయకుడిగా నటిస్తున్న రెండో సినిమా ‘కంచర్ల’. యాద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుని పాటల చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని నిర్మాత కంచర్ల అచ్యుతరావు తెలిపారు. ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. పూర్తి స్థాయి కుటుంబ కధ – యాక్షన్‌తో ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని, ప్రముఖ ఫైట్ మాస్టర్ ‘పుష్ప’ ఫేమ్ డ్రాగన్ ప్రకాష్ ఫైట్స్‌ను కంపోజ్ చేస్తున్నారని చెప్పారు.