Cloth in Stomach | జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ మహిళ గత పదహారు నెలలుగా నరకయాతనను అనుభవించింది. వేములవాడకు చెందిన నవ్యశ్రీ అనే మహిళ… డెలివరీ కోసం జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో గత నెల డిసెంబర్ లో చేరింది. అయితే అక్కడ ఆమెకు సిజేరియన్ చేసిన వైద్యులు కడుపులో క్లాత్ ను మర్చిపోయి కుట్లు వేశారు. దీంతో అప్పటినుండి నవ్యశ్రీ కడుపునొప్పితో బాధపడుతుంది. నొప్పి అధికం కావడంతో నవ్యశ్రీ ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరింది. దీంతో స్కానింగ్‌లో కడుపులో క్లాత్ ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. వెంటనే ఆమెకు సర్జరీ చేసి బట్టను బయటకు తీశారు. ఈ విషయం నవ్యశ్రీ కుటుంబ సభ్యులకు వైద్యులు వివరించడంతో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పలువురు ప్రజలు.. జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటే బయపడుతున్నారు. సంబంధిత అధికారులు పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటే తప్ప.. ప్రజలకు నమ్మకం కలిగేలా లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.