ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దర్యాప్తునకు సహకరించకుండా మొండిగా ప్రవర్తించినందువల్లే అరెస్ట్ కు దారితీసిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. కేజ్రీవాల్ అరెస్ట్ కు సంబం ధించి సుప్రీంకోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ తవ ప్రవర్తన, వెండి వైఖరి తో దర్యాప్తు అధికారి అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి కల్పించా రని ఈడీ పేర్కొంది. నిందితుడు దోషి అని నిరూపించేం దుకు అవసరమైన అన్ని పత్రాలు, వివరాలు, డాక్యుమెంట్లు దర్యాప్తు అధికారి వద్ద ఉన్నాయని ఈడి తెలిపింది. నింది తుడు దర్యాప్తునకు సహకరించ కుండా , మొండిగా ప్రవర్తిస్తూ, ఈడీ అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి కల్పించాడని సుప్రీం కోర్టుకు సమర్పిం చిన అఫిడవిట్ లో పేర్కొంది. తన అరెస్టును సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ లో వాస్తవం లేదని ఈడీ తెలిపింది. ఏజెన్సీ ఆధీనంలో ఉన్న సామగ్రిని వివిధ కోర్టులు ఇప్పటికే విచారిం చాయని పేర్కొంది.నిందితుడి వాదనలు దురుద్దేశం తో కూడిన వని, నిరాధారమైనవని ఈడే పేర్కొంది.


