24.2 C
Hyderabad
Tuesday, December 2, 2025
spot_img

‘ది కేరళ స్టోరీ’ తర్వాత సైకలాజికల్ హారర్‌తో వస్తున్న అదా శర్మ

‘ది కేర‌ళ స్టోరీ’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న అదాశర్మా తాజాగా సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీతో రాబోతోంది. అదే C.D (క్రిమినల్ ఆర్ డెవిల్). ఇప్పటిదాకా చూసిన హారర్ జానర్స్ లోకెల్లా ఆడియన్స్‌కి డిఫరెంట్ అనుభూతి కలిగించే స్టోరీతో డైరెక్టర్ కృష్ణ అన్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. RR ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అదా శర్మ సీరియస్ లుక్‌, ఆ చుట్టూ డెవిల్స్ హ్యాండ్స్ కనిపిస్తుండటం చిత్రంలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. C.D అనే టైటిల్ క్రిమినల్ ఆర్ డెవిల్ అనే ట్యాగ్ లైన్‌తో పోస్టర్ చూడగానే సినిమాపై ఆసక్తి నెలకొనేలా ఈ ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో కొత్త దారిలో వెళుతున్నాం అని పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. మొత్తంగా అయితే ఈ C.D ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచిందనే చెప్పుకోవచ్చు.

ఈ మూవీలో రీసెంట్ సెన్సేషన్ అదా శర్మ కీలక పాత్ర పోషిస్తుండగా.. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ముద్దు కృష్ణ డైలాగ్స్ అందించగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. చిత్రానికి సంబంధించిన అన్ని పనులు ఫినిష్ చేసి అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు.

నటీనటులు
అదా శర్మ, విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా

టెక్నీషియన్స్
బ్యానర్ : SSCM ప్రొడక్షన్స్
డైరెక్టర్ : కృష్ణ అన్నం
స్టోరీ డైలాగ్స్ : ఏ ముద్దు కృష్ణ
DOP : సతీష్ ముత్యాల
మ్యూజిక్ : RR ధృవన్
ఎడిటర్ : సత్య గిడుతూర్
యాక్షన్స్ : రామ కృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గిరిధర్

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్