25.2 C
Hyderabad
Tuesday, October 14, 2025
spot_img

దయనీయంగా మారిన పావలా శ్యామల జీవితం

రంగురంగుల ప్ర‌పంచంలో ఓ వెలుగు వెలిగిన ఆ తార జీవితాన్ని చీక‌ట్లు క‌మ్మేశాయి. వెండితెర‌పై న‌వ్వుల వాన కురిపించిన ఆ న‌టి ఇప్పుడు నిస్సహాయ‌స్థితిలోకి వెళ్లిపోయింది. త‌న‌ను కాపాడంటూ ఆ క‌ళామాత‌ల్లి ముద్దుబిడ్డ ఇప్పుడు చేతులెత్తి ఆర్థిస్తోంది. ద‌యనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల నిజ‌జీవిత క‌థ ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలిస్తోంది. కంటతడి పెట్టిస్తోంది.

పావలా శ్యామల… ఆ పేరు తలుచుకోగానే ఆమె విలక్షణమైన హాస్య నటన గుర్తుకు వచ్చి అందరి పెదాలపై చిర్నవ్వులు పూస్తాయి. కానీ అందరికీ ఆనందం పంచిపెట్టిన ఆమె మాత్రం చాలాకాలంగా దయనీయ జీవితం గడుపుతోంది. నిస్సాహ‌య‌స్థితిలో ఉన్న ఈ సీనియ‌ర్ న‌టి ఆప‌న్నహ‌స్తం అందించాల‌ని ఆర్థిస్తోంది. ఒకవైపు ఆర్ధిక భారం.. మరో వైపు వయోభారం ఆమెకు నరకం చూపిస్తున్నాయి.. అంతేకాకుండా ఎదిగిన కూతురు మంచానికి పరిమితమవ్వడం పావలా శ్యామలకి మనోవేదనను కల్గిస్తున్నాయి. గతంలో ఆమెకు కొంత మంది నుంచి సాయం అందినా అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్గించింది.

తనకు వచ్చిన అవార్డులను అమ్ముకొని ఆ డబ్బుతో బియ్యం, పప్పులు కొనుకొన్నరోజులున్నాయని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న తాము తినడానికి తిండి లేక ఒక్కోసారి ఐదు రోజులు పస్తులుండాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. ఇక మందులు ఎక్కడి నుంచి కొనుక్కోగలమని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఏదో ఓ రోజు ఇద్దరం మంచంలోనే ఆకలితో చనిపోతామని పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోవడంలేదు చెప్తుదంటే ఆమె పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు.

పావలా శ్యామల 1984లో బాబాయ్ అబ్బాయ్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి స్వర్ణ కమలం, కర్తవ్యం, ఇంద్ర, ఖడ్గం, బ్లేడ్ బాబ్జీ, గోలీమార్ వంటి సుమారు 250 సినిమాలలో హాస్య నటిగా, సహాయ నటిగా నటించారు. అనేక అవార్డులు అందుకొన్నారు. ఆమె నటనకు అనేక సంస్థలు సన్మానాలు చేశాయి. అటువంటి సినీ క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ‌కు నేడు తినడానికి తిండి కూడా లేక, అనారోగ్య సమస్యలతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

దినదిన గండంగా బతుకీడుస్తూ, ఆపన్నహస్త కోసం ఎదురుచూస్తున్న నటి పావలా శ్యామలకు సహాయం చెయ్యాలనుకునేవారు.. Neti Shyamala , A/c: 52012871059, IFSC :SBIN0020458, Srikrishna Nager , Yusuf guda Beanch , Hyderabad , Cell : 98 49 175713 సంప్ర‌దించ‌వ‌చ్చు. పావలా శ్యామల ప్రస్తుతం ఫిర్జాదీగూడలోని ఓ వృద్దాశ్రమంలో ఉంటుంది.. ఆ ఆశ్రమానికి నెలవారి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతుంది. ఆమెకు డబ్బు, మందులు, నిత్యావసర సరుకులు మరేదైనా ఇచ్చి సాయపడాలనుకొంటే నేరుగా ఆమె ఇంటికే వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. సినీ క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ‌ను కాపాడుకోవాల్సిన స‌మ‌య‌మిది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్