Actress Kaniha |ఈ హీరోయిన్ తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసినా.. ప్రేక్షకులకు గుర్తుండిపోయే నటన, అందచందాలతో ఆకట్టుకుంది. శ్రీకాంతో హీరోగా ‘ఒట్టేసి చెబుతున్నా’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన కనిహా, తర్వాత నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రంలోనూ నటించింది. అనంతరం 2008లో పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. పెళ్లైన కొన్నాళ్లకు మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన కనిహా.. ప్రస్తుతం మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్మడు కాలుకు ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్న ఆమె వాకర్ పట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్యాలెన్సింగ్ గా అడుగులు వేయడం నేర్చుకుంటున్నా అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో కనిహా(Actress Kaniha) త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీలతో సహా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.