హైదరాబాద్: సినీ నటి అనన్య నాగళ్ల బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని హ్యాపీ మొబైల్ స్టోర్స్‌లో సందడి చేసింది. Redmi Note 13 సిరీస్‌ను హ్యాపీ మొబైల్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి అనన్య లాంచ్ చేసింది. హ్యాపీ మొబైల్స్ సంస్థ రెడ్ మీ నోట్ 13 సిరీస్ ఫోన్లతో వచ్చే లాభాలతో అక్షయ పాత్ర ద్వారా పేదలకు భోజన సదుపాయం కల్పించడం తనను ఎంతగానో మెప్పించిందని అనన్య కొనియాడింది. అలాగే రక్త దాన శిబిరాలను నిర్వహిస్తూ.. వాటిలో తమ కస్టమర్లను భాగం చేయడం ద్వారా గొప్ప విషయమని తెలిపింది. రక్తదానం ద్వారా తాము ఇప్పటి వరకు 10 వేలకు పైగా జీవితాలను కాపాడగలిగామని హ్యాపీ మొబైల్స్ సీఎండీ డి కృష్ణ పవన్ తెలిపారు.