కేరింత మూవీ ఫేమ్ హీరో పార్వతీశం, కొత్తమ్మాయి ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వీఎస్ ముఖేష్ దర్శకత్వంలో అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ మూవీ ‘టీజర్’ ని టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు లాంచ్ చేశారు.
అనంతరం హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘‘’మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ టీజర్ చూశాను. చాలా ఫన్నీగా ఉంటూనే హీరో హీరోయిన్ క్యారెక్టరైజెషన్ బాగుంది. హీరో పార్వతీశం నాకు ఇష్టమైన వ్యక్తి. అతని కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకొస్తుందని బలంగా నమ్ముతున్నాను. డైరెక్టర్ వీఎస్ ముఖేష్ చేసిన కొత్త ప్రయత్నాన్ని ప్రతి ప్రేక్షకుడు ఆదరిస్తారని కోరుకుంటూ టీం అందరికి ఆల్ ది బెస్ట్.’’ అని అన్నారు.
హీరో ‘పార్వతీశం’ మాట్లాడుతూ ‘‘మా సినిమా టీజర్‌ని రీలిజ్ చేసినందుకు శ్రీ విష్ణు గారికి నా కృతజ్ఞతలు. మా టీజర్ మీకు నచ్చితే పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.’’ అని అన్నారు.
కమెడియన్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ‘‘హీరో శ్రీ విష్ణు గారు మా సినిమా టీజర్‌ని లాంచ్ చేసినందుకు నేను చాలా హ్యాపీ. ఎందుకంటే, మార్కెట్ మహాలక్ష్మి లాంటి సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కథలను శ్రీ విష్ణు గారు గతంలో చాలానే చేశారు, చేస్తూనే ఉన్నారు. సో, మా సినిమా టీజర్ అలాంటి వ్యక్తి ద్వారా రీలిజ్ కావడం నాకు ఆనందంగా ఉంది. పైగా, అయన నాకు ఎంతో ఇష్టమైన హీరో.’’ అని అన్నారు.