హైదరాబాద్ మీర్‌పేట్ మహిళ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలతో గురుమూర్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. గురుమూర్తితో ఇంటివద్ద పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. క్లూస్ టీం సహాయంతో మీర్‌పేట్ పోలీసులు మరికొన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. మాధవిని హత్య చేసినట్లుగా గురుమూర్తి ఒప్పుకున్నాడు. గురుమూర్తిని సాయంత్రంలోపు రిమాండ్‌కు తరలించనున్నారు పోలీసులు. మాధవి కనిపించకుండా పోయిందన్న కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు… అయితే ఆ కేసును ఇప్పుడు మర్డర్ కేసుగా మార్చారు.
పది రోజుల క్రితం వెంకట మాధవిని గురుమూర్తి కిరాతకంగా హతమార్చారు. సంక్రాంతి రోజు భార్య మాధవితో గొడవపడి దాడి చేశాడు. ఈ దాడిలో వెంకట మాధవి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో.. స్పృహ లేకుండా పడిపోయిన మాధవిని ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు గురుమూర్తి. ఈ హత్యకు సంబంధించి నిందితుడు గురుమూర్తి పోలీసులకు చెప్పిన విషయాలు వణుకు పుట్టించాయి.
కాగా.. భార్య వెంకట మాధవి హత్య కేసులో నిందితుడు భర్త గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకట మాధవిని గురుమూర్తి కిరాతకంగా హత్య చేసి.. ముక్కలుగా చేశాడు. అంతేకాకుండా.. భార్య మృతదేహం ముక్కలను వాటర్ హీటర్‌లో వేసి ఉడకపెట్టాడు. మృతదేహం ముక్కలు ఉడికిన తర్వాత కమర్షియల్ స్టవ్ పైన పెట్టి కాల్చాడు నిందితుడు గురుమూర్తి.. బాగా కాలిపోయిన ఎముకల్ని పొడిగా చేసి చెరువులో కలిపేశాడు. అయితే.. తన కూతురు కనపడటం లేదని వెంకట మాధవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు బట్టబయలయ్యాయి. కాగా.. ఈ హత్య కేసులో సాంకేతిక ఆధారాలతో నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు.