ఏసీబీ తప్పుడు కేసుపెట్టి కేటీఆర్‌ను వేధిస్తోందని కేటీఆర్ లాయర్ సోమభరత్ ఆరోపించారు. అడ్వకేట్‌తో విచారణకు వెళ్లడం వ్యక్తి ప్రాథమిక హక్కని చెప్పారు. పద్దతి ప్రకారం విచారణ చేయాలని ఏసీబీ అధికారులకు లేనట్టుందని అన్నారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు.
మీరు లోపల కుట్ర చేయాలి అనుకోకపోతే అడ్వొకేట్‌ను ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉంది.. ఈ జడ్జిమెంట్ వచ్చేవరకు ఓపిక పట్టి మాకు టైం ఇవ్వండని ఏసీబీ అధికారులకుక లెటర్ ఇచ్చాము. ఈ లెటర్ ఇవ్వడానికి కలిసి వెళ్ళాము. అడ్వొకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్. రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా కాలదన్నే పద్ధతుల్లో మీరు అడ్వకేట్లను తీసుకురావొద్దనడం ఏంటి?
ఇటీవల కూడా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇవ్వని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చినట్టు రాసుకున్నారు.. ఇవాళ అది జరగకూడదని మేము కలిసి వెళ్ళాము. అడ్వకేట్‌ను అసలు ఏసీబీ ఆఫీస్ లోపలికి ఎందుకు రానివ్వ లేదు.. దాని వల్ల మీకు నష్టం ఏమిటటి?.. అని ప్రశ్నించారు అడ్వొకేట్ సోమభరత్.