Sathvik Suicide | ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఏబీవీపీ(ABVP) కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నార్సింగి శ్రీ చైతన్య కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నేతల నిరసనలతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నార్సింగిలోని చైతన్య కాలేజీ దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొంది. సాత్విక్(Sathvik) మృతిపై నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంటకరెడ్డి(Komatireddy Venkatreddy) యాజమాన్యాన్ని నిలదీశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita indra Reddy) ఆఫీస్ ముట్టడికి SFI, PDSU నేతలు ప్రయత్నించారు. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. చైతన్య, నారాయణ కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అటు సాత్విక్(Sathvik)ఆత్మహత్యపై ఆందోళనలతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాత్విక్(Satvik) ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై ఇంటర్ బోర్డు విచారణ చేపట్టింది. శ్రీ చైతన్య యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. డీఈవో ఆధ్వర్యంలో కాలేజీలో అధికారులు విచారణ చేపట్టారు. కాలేజీ యాజమాన్యం వివరణ తర్వాత తుది నివేదికను బోర్డు కమిషనర్ కు అందజేయనున్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు నివేదికను చైల్డ్ రైట్స్(Child Rights) కమిషన్ నివేదిక కోరింది.
Read Also: గంజాయి బ్యాచ్ దారుణం.. డబ్బులివ్వలేదని బాలుడిని గుట్టల్లోకి తీసుకెళ్లి..
Follow us on: Youtube