29.1 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

అభిన‌వ్ గోమఠం ‘మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్‌రా’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

ఈ న‌గ‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా, సేవ్ టైగ‌ర్ చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా పాపులారిటీ సంపాందించుకుని, త‌న‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం. అయితే తాజాగా ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రంలో అత‌ని పాపుల‌ర్ డైలాగ్ అయిన మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా టైటిల్‌తోనే అభిన‌వ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్ హీరోయిన్‌. కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాక‌పంపై తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వంలో భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌తో పాటు చిత్ర విడుద‌ల తేదిని సోమ‌వారం ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఫిబ్ర‌వ‌రి 23న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ హాస్య‌న‌టుడిగా, స‌హాయ నటుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న అభిన‌వ్ గోమఠం లోని కొత్త కోణాన్ని, న‌టుడిలోని మ‌రో కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు. అన్నిభావోద్వేగాల మేళ‌వింపుతో ల‌వ్‌, కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. ప్ర‌తి పాత్ర ఎంతో స‌హ‌జంగా ఆక‌ట్టుకునే విధంగా వుంటుంది. కొత్త‌దనంతో కూడిన ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌ర్ని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

త‌రుణ్‌భాస్క‌ర్‌, అలీ రేజా, మొయిన్‌, చ‌క్ర‌పాణి ఆనంద్‌, నిళ‌గ‌ల్ ర‌వి, జ్యోతి రెడ్డి, లావ‌ణ్య రెడ్డి, శ్వేత అవ‌స్థి, ర‌వీంద‌ర్ రెడ్డి, సూర్య‌, రాకెట్ రాఘ‌వ, సాయిక్రిష్ణ‌, ఫ‌ణి చంద్ర‌శేఖ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:సిద్దార్థ స్వ‌యంభూ, ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజాల‌, ఆర్ట్‌: శ‌ర‌వ‌ణ‌న్ వ‌సంత్‌, క‌థ‌: అన్వ‌ర్ సాథిక్‌, డైలాగ్స్‌:
రాధామోహ‌న్ గుంటి, సంగీతం: సంజీవ్ టి, నేప‌థ్య సంగీతం: శ్యాముల్ అబే, ఎడిట‌ర్ ర‌వితేజ గిరిజాల‌.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్