ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఇవాళ ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో మోదీ నివాసం వద్ద భారీగా భద్రత బలగాలు మోహరించాయి. ప్రధాని ఇంటి ముట్టడికి వచ్చే ఆప్ వర్గాలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీనికి వ్యతిరేకంగా ఆప్ వర్గం ప్రధాని నివాసం దగ్గర నేడు ఆందోళన చేపట్టనుంది. కేజ్రీవాల్ అరెస్టుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తమ పోరాటం ఉధృతం చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు.


