Viral News |ఫంక్షన్ ఏదైనా సరే సందడే వేరు.. తెలిసిన వాళ్లు.. తెలియని వాళ్లు ఇలా అంతా ఒకచోట కలిసిన వేళ.. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌తో అక్కడి దృశ్యాలన్ని చిత్రీకరిస్తాం.. ముఖ్యంగా వివాహ వేడుకల్లో అయితే.. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తెలను, వివాహ వేడుకల ఘట్టాలను ఫోన్‌లో బంధిస్తాం.. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత.. ఏ పంక్షన్‌కు వెళ్లినా భోజనం చేయకుండా వస్తారేమో కాని.. ఫోటోలు తియ్యకుండా రారు. ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండ్.. సాధారణగా ఏవైనా వేడుకల్లో జరిగే ఇన్సిడెంట్స్ తప్పకుండా నవ్వు తెప్పిస్తాయి. అదే సమయంలో మరికొన్ని ఘటనలు నవ్వు తెప్పిస్తాయి. స్నేహితుల అల్లరి, అమ్మలక్కల కబుర్లు.. ఇలా కొన్ని వేడుకల్లో ఎక్కడలేని ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. ఇంటర్నెట్‌లో పెళ్లి వీడియోలు ఎన్నో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే మాత్రం మీరు నవ్వకుండా ఉండలేరు.
సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతున్న వీడియోను చూస్తే.. ఓ పెళ్లి వేడుకలో వధూవరులను ఓ మహిళ ఫోటోలు తీయాలనుకుంది. వెనుకాల కాలువ ఉందని చూడకుండా.. ఫోటోలు తీసే క్రమంలో వెనక్కి నడుస్తుంది ఫోటోలు తీయాలనుకున్న మహిళ. అంతే.. ఇంకేముంది.. ఒక్కసారిగా అక్కడున్న మురికి కాలువలోకి జారి పడిపోయింది. పక్కనున్నవారంతా ఆమెను కాలువలో నుంచి బయటికి తీశారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియనప్పటికి.. ఇంటర్నెట్‌లో మాత్రం తెగ వైరల్ అవుతోంది. పెళ్లిలో ఫోటోలు తీయడమే కాదు.. చుట్టుప్రక్కల ఉన్న వాటిని కొంచెం గమనించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
View this post on Instagram