29.6 C
Hyderabad
Friday, June 27, 2025
spot_img

Sucker Mouth Catfish: ఆక్వా రైతులను బెంబేలేత్తిస్తున్న వింత చేప

స్వతంత్ర వెబ్ డెస్క్: దెయ్యం చేప.. ఈ పేరు వింటేనే.. కొల్లేరు ఆక్వా రైతులు హడలెత్తిపోతున్నారు. స్థానికంగా దెయ్యం చేప, విమానం చేప అని పిలుస్తారు. సాంకేతిక పరిభాషలో శాస్త్రీయంగా చెప్పాలంటే దీన్ని ‘సక్కర్‌ మౌత్‌ క్యాట్‌ ఫిష్’‌ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వన్స్‌ ఇది చెరువులోకి ఎంటర్‌ అయిందా.. ఇక అంతే…. ఈ చేప తన సంతానాన్ని తక్కువ కాలంలోనే పది రెట్లు… వంద రెట్లు పెంచేసుకుని రైతులు వేసిన మేత మొత్తాన్ని తినేస్తుంది. కేవలం మేత మాత్రమే కాదు.. ఇది మాంసాహారి కూడా…! తన కంటే చిన్నవైన ఇతర చేపల్ని సైతం మింగేస్తుంది. దీంతో లబోదిబో మంటున్నారు ఆక్వా రైతులు.

ఈ చేప కాలువల ద్వారా.. ఇప్పుడు కొల్లేరులోకి ప్రవేశించి పరివాహక ప్రాంత చెరువుల్లోకి వ్యాపించింది. ఈ చేపను చంపేందుకు ఎన్నో మందులు వాడిన ఫలితం లేకుండా పోతోంది. రైతు కొన్ని లక్షల సంఖ్యలో చేప పిల్లలను చెరువులోకి వదిలితే… దెయ్యం చేప దెబ్బకి అవి వేలల్లోనే మిగులుతున్నాయి. ఇది చాలా మొండిది. భూమి పొరల్లోకి వెళ్లి బతుకుతుంది. ఈ చేప నీరు లేకపోయినప్పటికీ… 15 రోజులకుపైగా బతకగలదు. భూమి లోపల నుంచే గట్లను తొలచుకుని… మరో చెరువులోకి వచ్చేస్తుంది. అంతేకాదు.. ఒకవేళ వలలో చిక్కినా తన పదునైన పళ్లతో తప్పించుకుంటుంది. ఈ చేపలు మనుషులను కూడా కరిచి తీవ్రంగా గాయపరుస్తాయి.

 

 

వాస్తవానికి ఇది ఎక్వేరియం రకపు చేప. దక్షిణ అమెరికా నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అయింది. ఎక్వేరియంలలో పట్టే నాచును తిని… ఆ గాజు పలకలు శుభ్రంగా కనిపించటానికి పెంచేవారు. కాని దాన్ని నిర్లక్ష్యంగా ఇళ్లు ఖాళీ చేసే సమయంలో, ఒక ఊరునుంచి మరో ఊరు వెళ్లేపుడు కాలువల్లో పడేయటంతో… ఇపుడు డ్రైనేజల నుంచి కాలువలకు, కాలువల నుంచి రిజర్వాయర్లు, చెరువులు, నదుల్లోకి వచ్చి చేరింది. దీన్ని మందులతో ఇతర మార్గాల్లోనూ… చంపటం సాధ్యం కాదంటున్నారు అధికారులు. నిర్మూలన సాధ్యం కాని ఈ దెయ్యం చేపల వల్ల ప్రతి యేటా తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల ఆదాయాన్ని రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా.. ఈ డెవిల్‌ ఫిష్ నిర్మూలనకు శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను కోరుతున్నారు ఆక్వా రైతులు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్