Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

వలస బాట పట్టిన గులాబీ దండు

భారత్ రాష్ట్ర సమితి ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డి పోరాడాల్సిన సమయంలో గులాబీ పార్టీ నుంచి వలసలు ప్రారంభమ య్యాయి. చిన్నాచితకా నాయకులు కాదు…బడా నేతలు కూడా ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి జంపులు చేస్తున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా పలువురు భారత్ రాష్ట్ర సమితికి గుడ్‌బై కొట్టారు. మొత్తానికి గులాబీ దండు ఖాళీ అవుతోంది.

కారు పంక్చర్ అయింది. భారత్ రాష్ట్ర సమితికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బనుంచి గులాబీ పార్టీ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో పులి మీద పుట్రలా గులాబీ పార్టీలోని బడా నాయకులు ఇతర పార్టీల్లోకి వలస వెళుతున్నారు. భారత్ రాష్ట్ర సమితి ఖాళీ అవుతోంది. బీఆర్ఎస్ అంటే చిన్నాచితకా పార్టీ కాదు. మౌలికంగా బీఆర్‌ఎస్‌ ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో గులాబీ పార్టీ కీలక పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. విభజన తరువాత వరుసగా రెండు సార్లు గులాబీ పార్టీని ఆశీర్వదించారు. ఉద్యమపార్టీ అధినేతగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరుసగా రెండుసార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. పదేళ్లపాటు తెలంగాణను పరిపాలించారు కేసీఆర్‌. అయితే ఉద్యమాల నుంచి ఎదిగొచ్చిన బీఆర్ఎస్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా తయారైంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. పదేళ్లు తెలంగాణను పరిపాలించిన భారత్ రాష్ట్ర సమితికి ప్రస్తుతం షాక్ ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మూడు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్‌ఎస్ నాయకులు ఇతర పార్టీల వైపు చూడటం మొదలైంది.

ఇదిలా ఉంటే వలసబాట పట్టిన నాయకులు గులాబీ పార్టీ పెద్దలపై ఎడాపెడా విమర్శలు చేస్తున్నారు. అసలు భారత్ రాష్ట్ర సమితిలో ప్రజాస్వామ్యం అనేదే లేదని మండిపడ్డారు. పార్టీ విధానాల్లో కేసీఆర్ అహంకారపూ రితంగా వ్యవహ రించారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నన్నాళ్లు పార్టీ పెద్దలు తమను పట్టించుకోలేదని కొంతమంది నాయకులు అంటున్నారు. కాగా ప్రజా తీర్పును పార్టీ పెద్దలు గౌరవించడం లేదని మరికొందరు నిప్పులు చెరుగుతున్నారు. కాగా పార్టీ పెద్దల మీద విమర్శల సంగతి ఎలాగున్నా, గులాబీ పార్టీలో కొనసాగితే భవిష్యత్తు ఉండదని చాలా మంది తమ దారి తాము చూసుకుంటున్నారన్నది ఓపెన్  సీక్రెట్. ఛోటామోటా నాయకుల నుంచి పార్లమెంటు సభ్యుల వరకు బీఆర్ఎస్ నేతలు వలసబాట పట్టడం మొదలైంది.

మే నెలలో తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు గులాబీ పార్టీ పెద్దలు ఎన్నికలను ఎదుర్కోవడంపై వ్యూహాలు పన్నుతుంటే మరోవైపు ఇతర పార్టీల్లోకి జంపులు చేయడంలో నాయకులు బిజీ అయి పోయారు. ఎంపీ టికెట్ ఇస్తామనీ, ప్రచారానికి కావలసినవన్నీ చూసుకుంటామని పార్టీ పెద్దలు పిలిచి చెబుతున్నా, గులాబీ పార్టీలో ఉండటానికి చాలా మంది నేతలు ఇష్టపడటం లేదు. తాజాగా వరంగల్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫున అభ్యర్థిత్వం ఖరారైన డాక్టర్ కడియం కావ్య తాను పోటీ చేయడం లేదని కుండబద్దలు కొట్టారు.

    ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడైన సీనియర్ నేత కే. కేశవరావు కూడా పార్టీకి గుడ్ బై కొట్టారు. భారత్ రాష్ట్ర సమితి అంటే కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబమే అనే అభిప్రాయం తెలంగాణ సమాజంలో నెలకొందన్నారు. కొన్ని సరిచేసుకోవాల్సినవి గులాబీ పార్టీ అధిష్టానం సరిచేసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో ఘర్ వాపసీ కావాలని తాను నిర్ణయించుకున్నట్లు కేశవరావు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన మర్నాడే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి భారత్ రాష్ట్ర సమితికి గుడ్‌బై కొట్టారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. రంజిత్ రెడ్డి తో పాటు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పార్టీని వీడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ వీరిద్దరికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అలాగే కొన్ని రోజుల కిందట పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా గులాబీ పార్టీకి గుడ్‌ బై కొట్టారు. అయితే వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా బీఆర్ఎస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ వైదొలగారు. ఈ సందర్భంగా హై డ్రామా నడిచింది. ఆరూరి రమేష్ ను బుజ్జగించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ఒక దశలో తాను పార్టీ మారేది లేదని రమేష్ పేర్కొన్నారు. చివరకు భారతీయ జనతా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆరూరి రమేష్. ఇదిలా ఉంటే కొన్ని రోజుల కిందట మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియు ద్దీన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ అనిత, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి భారత్ రాష్ట్ర సమితికి గుడ్ బై కొట్టి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఇటీవల కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరే కాదు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

        బీఆర్‌ఎస్ నుంచి ప్రధానంగా కాంగ్రెస్‌లోకి వలసలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు తాము రెడీగా ఉన్నట్లు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ లోపాయికారీగా సంకేతాలు పంపుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. పార్టీ మారే అంశానికి సంబంధించి తమకు అత్యంత నమ్మకస్తులనుకున్న అనుచరులతో నేతలు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారాలన్న ఉద్దేశం ఉన్నవారు అప్పుడప్పుడు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. మీరు ఊ అంటే…హస్తం పార్టీలోకి జంప్ చేస్తామంటూ సంకేతాలు పంపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్‌ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ లోకి జంప్ చేస్తు న్నారా ? అని ఎవరైనా అడిగితే…అబ్బే లేదంటున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ది పను లకోసమేనంటూ ప్రశ్నను దాటవేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ పెద్దల నుంచి గట్టి హామీ వచ్చేంతవరకు వెయిట్ అండ్ సీ అనే ధోరణిలో గులాబీ పార్టీ నేతలు వ్యవహరి స్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలోకే కాదు బీజేపీలోకి కూడా గులాబీ పార్టీ నేతలు వలసలు మొదలెట్టారు. ఛోటామోటా నాయకులే కాదు సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు కూడా కమలం వైపు చూస్తున్నారు. ఇప్పటికే జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కమలం పార్టీలో చేరారు. వీరేకాదు మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, శానంపూడి సైదిరెడ్డి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా బీబీ పాటిల్‌తోపాటు రాములు కుమారుడు భరత్‌కు, సీతారాం నాయక్‌కు, గోడెం నగేశ్‌కు అలాగే శానంపూడి సైదిరెడ్డికి ఎంపీ టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఏమైనా ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎప్పుడు ఎవరు పార్టీని వీడుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కొక్కరుగా వలసబాట పడు తున్నారు. అంతిమంగా తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఘర్ వాపసీ కార్యక్రమం జోరందుకుంది. 

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్