కాంగ్రెస్ నేతలు మూసీని ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మూసీ పేరుతో కోట్ల ప్రజాధనం లూటీ చేస్తున్నారని చెప్పారు. మూసీ నది కాలుష్యానికి కారణం కాంగ్రెస్ పార్టీనే మండిపడ్డారు. మూసీ నదిని శుద్ధి చేయాలని కేసీఆర్ ఆనాడే నడుం బిగించారని గుర్తు చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. లూటీ చేసిన దాంట్లో నుంచి ఢిల్లీకి కప్పం కట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. కాంగ్రెస్ తమ పార్టీ నేతలపై రౌడీ మూకలతో దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తల్చుకుంటే కాంగ్రెస్ నాయకులు ఎక్కడ తిరగలేరని కవిత హెచ్చరించారు.