హైదరాబాద్ మాదాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు 16 నెలల పసిపాపకు పునర్జన్మ ప్రసాదించారు. టంజాని యా దేశానికి చెందిన పసిపాపకు వారు అరుదైన చికిత్స చేశారు. పుట్టుకతోనే ఆ పాపకు శరీరంపై గుండె పెరిగి గడ్డలా మారింది. దీంతో ఆ పసిపాప కుటుంబం మెడికవర్ వైద్యులను సంప్రదించింది. ఎనిమిది మంది మెడికవర్ వైద్య బృందం 14 గంటల పాటు శ్రమించి విజయవంతంగా సర్జరీ పూర్తిచేసింది. లక్ష మంది పుట్టిన పిల్లలలో ఒకరు ఇలాంటి సమస్యతో పుడతారని వైద్యులు తెలిపారు. మన దేశంలో ఇంత వరకు ఇలాంటివి 12 చికిత్సలు జరిగాయన్నారు.