స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అతడో పూజారి.. ఆమె ఓ వ్యాపారి.. ఇద్దరు కలిసి క్షుద్రపూజలకు పూనుకున్నారు. తాటికొండ మండలం పొన్నేకల్లుకు చెందిన పూజారి నాగేశ్వరరావుకు సోషల్ మీడియా ద్వారా చిలకలూరిపేటకు చెందిన అరవింద అనే మహిళ పరిచయమైంది. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని అరవింద నాగేశ్వరరావుకు చెప్పడంతో గుప్త నిధులు ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపాడు. ఇందుకు యువతలతో నగ్నంగా క్షుద్రపూజలు చేయాల్సి ఉంటుందని నమ్మించాడు.
దీంతో పూజల్లో నగ్నంగా కూర్చుంటే లక్ష రూపాయలు ఇస్తామని ఇద్దరూ నాగేంద్ర అనే వ్యక్తిని ఆశ్రయించారు. అతను తన స్నేహితుడు సురేశ్‌తో కలిసి నంద్యాల జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు యువతులకు డబ్బులు ఆశగా చూపించారు. అనంతరం పూజారి వారిని నగ్నంగా కూర్చోబెట్టి పూజలు నిర్వహించాడు.
అంతటితో ఆగకుండా యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీనికి వారు ఒప్పుకోకపోవడంతో కారులో గుంటూరు వైపు తీసుకెళ్తుండగా గోరంట్ల సమీపంలో యువతులు తప్పించుకుని దిశ యాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అప్రమత్తమైన నల్లపాడు పోలీసులు పూజారితో పాటు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.