స్వతంత్ర వెబ్ డెస్క్: కేసీఆర్(KCR) అసెంబ్లీ అభ్యర్థుల మెుదటి జాబితాలో మెుత్తం 115 మందికి టికెట్లు కేటాయించారు. మెుత్తం అభ్యర్థుల్లో ఏడుగురు మహిళలకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ టికెట్లపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) కీలక కామెంట్స్ చేశారు.
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో( Jantar Mantar) దొంగ దీక్షలు చేస్తారని, తెలంగాణలో మాత్రం 33 శాతం సీట్లు కేటాయించకుండా.. కేవలం 7 సీట్లే మహిళలకు కేటాయించారని విమర్శించారు. ఇదేనా కేసీఆర్ కుటుంబానికి వచ్చే లెక్కలు అని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “మహిళల హక్కుల పట్ల మీ ఆందోళన ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది స్వాగతించదగినది. ఎట్టకేలకు బీజెపికి చెందిన ఓ నాయకుడు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ గురించి ఆలోచించారు.
కిషన్ అన్నా.. పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో మీ పార్టీనే అధికారంలో ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి 2 సార్లు మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాన్ని విస్మరించారు. ఇప్పటికైనా బిల్లును ఆమోదించండి. మీ రాజకీయ అభద్రతను మహిళా ప్రాతినిధ్యానికి ముడి పెట్టొద్దు” అని కవిత ట్వీట్ చేశారు.