నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పింక్ పోలింగ్ స్టేషన్‌ను సబ్ కలెక్టర్ విద్యాధరి, ఎన్నికల పరిశీలకులు రామ్ గౌతమ్ ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాన్ని పింక్ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశామని సబ్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని అన్నారు.


