కేవలం రూ.60కోసం పదేళ్ల పాటు న్యాయస్థానంలో పోరాడిన ఓ వ్యక్తి ఎట్టకేలకు విజయం సాధించాడు. ఢిల్లీకి చెందిన కమల్ ఆనంద్ అనే వ్యక్తి 2013లో సాకేత్ డిస్ట్రిక్ట్ సెంటర్‌లో ఉన్న ఓ మాల్‌లోని కోస్టా కాఫీ ఔట్‌లెట్‌లో కాఫీ తాగేందుకు తన భార్యతో కలిసి వెళ్లాడు. అక్కడ కాఫీ తాగితే పార్కింగ్ ఫ్రీ అని వారికి ఓ ఆఫర్ స్లిప్ ఇచ్చారు. దీంతో కారు పార్కింగ్ చేసి కాఫీ తాగడానికి వెళ్లారు. తిరిగి కారును పార్కింగ్ నుంచి బయటకు తీస్తుండగా నిర్వాహకుడు పార్కింగ్ ఫీజు కింద రూ.60 చెల్లించాలని డిమాండ్ చేశాడు. వెంటనే తన దగ్గర పార్కింగ్ ఫ్రీ ఆఫర్ స్లిప్ ను చూపించాడు. అయినా కానీ రూ.60 కట్టాల్సిందేనని పట్టుబట్టాడు. ఇక చేసేదేమి లేక ఆ ఫీజు కట్టాడు. అనంతరం వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. పదేళ్ల పాటు విచారణ చేపట్టిన కోర్టు.. పార్కింగ్ ఫీజు వసూలు చేసిన నిర్వాహకులకి రూ.61,201 జరిమానా కింద కమల్‌కు చెల్లించాలని ఆదేశించింది.