రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఎగ్జిట్-17 వద్ద టైర్ బ్లాస్ట్ అయి ఇటుక వాహనం బోల్తా కొట్టింది. దాన్ని తప్పించబోయిన బస్సు డ్రైవర్ కారును ఢీ కొట్టుకుంటూ డివైడర్‌ను ఢీకొట్టి కంట్రోల్ చేశాడు. భయంతో బస్సులోని 30 మంది ప్రయాణి కులు కేకలు వేశారు. స్పల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మ రం చేశారు.