ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి కీలక ఘట్టం ముగిసింది. 16 వేల కోట్లు రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకుతో పాటు ఏడీ బ్యాంకు ముందుకొచ్చాయి. ఈ మేరకు రెండు సంస్థలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఢిల్లీలో జరిగిన సమావేశంలో బ్యాంకు ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర అధికారులు సుమారు 8 గంటల పాటు చర్చించారు. అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలు రూపొందించారు. దీంతో రాజధాని రుణ ఒప్పందంలో పురోగతి లభించింది.
ఈ ఒప్పందానికి డిసెంబర్‌లో జరిగే బోర్డు సమావేశంలో ప్రపంచ బ్యాంకు ఆమోద ముద్ర వేయనుంది. అనంతరం ఒప్పంద ప్రతాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, బ్యాంకు ప్రతినిథులు సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత 16 వేల కోట్ల రుణాల విడుదల ప్రక్రియ ప్రారంభంకానుంది. ప్రపంచ బ్యాకు, ఏడీబీ చెరో 8 వేల కోట్ల రుణాలను ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి అందజేయనున్నాయి.