31 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 ప్రభాకర్ రావు, A6 శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్ పోల్‌కు సీబీఐ లేఖ రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సీబీఐ అనుమతించింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్‌‌రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. కాగా ఇప్పటికే ప్రభాకర్ రావుపై కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ప్రభాకర్‌రావు వర్చువల్‌గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత అమెరికాకు ప్రభాకర్ రావు వెళ్లిపోయారు. అమెరికాలో ఉన్న ఆయనను ఇండియాకు రప్పించేందుకు సీఐడీ ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. ముందుగా ప్రభాకర్ రావు‌కు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది.

రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన విషయాన్ని సీబీఐకి సీఐడీ అధికారులు తెలిపారు. సీబీఐ నుంచి ఇంటర్ పోల్‌కి సీఐడీ అధికారులు సమాచారం అందజేశారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు సీఐడీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రభాకర్ రావుపైన నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ప్రభాకర్ రావుని హాజరుపరచాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేనని సిట్‌కు ప్రభాకర్ రావు తెలిపారు. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావుని హైదరాబాద్‌కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికాతో సిట్‌కు ఉన్న ఒప్పందాల ప్రకారం ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాకర్ రావు ఒకవేళ విచారణకు హాజరైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్నారు. ఫోన్ ట్యా పింగ్ కేసులో A6గా ఉన్న శ్రవణ్ రావు పైన కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. శ్రవణ్ రావ్ ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రభాకర్ రావు శ్రవణ్ రావులని హైదరాబాద్‌కు రప్పించే ప్రయత్నం చేస్తున్నామని సిట్ అధికారులు చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్