స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వచ్చారు. కొద్ది రోజుల కిందట సీఎం జగన్‌పై అంబటి రాయుడు ప్రశంసలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో రాయుడు పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు పెరిగాయి. దీంతో రాష్ట్రంలోని పలువు విశ్లేషకులు అంబటి రాయుడు వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.