స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పొత్తుల గురించి కమ్యూనిస్ట్ నేత, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీతో పొత్తు పొట్టుకోవాలనే అంశంపై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీతో నైనా పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంటామని వెల్లడించారు.
కర్ణాటక ఎన్నికలపై మాట్లాడుతూ.. మొన్నటి ఫలితాలతో రాజకీయ పరిణామాలు మారాయని అన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా నాయకత్వం వహించి ప్రచారం చేసిన బీజేపీ ఓటమి పాలయ్యిందన్నారు. కర్ణాటక రిజల్ట్స్ తో దక్షిణాదిన కమలం పార్టీకి గేట్లు మూసుకుపోయాయన్నారు. కర్ణాటకలో 212 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు మద్దతు తెలిపారని అన్నారు.