28.2 C
Hyderabad
Sunday, May 11, 2025
spot_img

మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరట..! – రూ.7లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు..!

  • ఐదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
  • మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చివరి పూర్తి బడ్జెట్
  • మౌళిక సదుపాయాల కల్పనకు భారీగా కేటాయింపులు
  • 2023-24లో ఆర్థిక వృద్ధి రేటు 6 నుంచి 6.8 శాతంగా అంచనా
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2024 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తి బడ్జెట్ ఇది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి డిజిటల్‌ పద్దును పార్లమెంట్‌కు సమర్పిస్తున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కేంద్ర బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24ను సభ ముందుకు తెచ్చారు. వరుసగా ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా నిర్మల రికార్డ్ సృష్టించారు. నిర్మలమ్మ పద్దుకోసం యావద్దేశం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక.. కేంద్ర బడ్జెట్‌ను వరుసగా ఐదుసార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రుల సరసన నిర్మలా సీతారామన్ చేరారు. ఇప్పటివరకూ అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్.. ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

మోదీ సర్కార్ కు ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడం, 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో మౌళిక సదుపాయాల కల్పనకు భారీగా కేటాయింపులు ఉండొచ్చని విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. భారీ ప్రాజెక్టులు ప్రకటించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనపై దృష్టి సారించే అవకాశం ఉంది. వీటితోపాటు సంక్షేమ పథకాల అమలుకు సరైన అవరసమైనటువంటి నిధుల కేటాయింపు కూడా భారీగా పెంచే అవకాశం కనిపిస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా అనవసరమైన వస్తువులు ఖరీదైనవి కావచ్చని అంచనా. ప్రైవేట్ జెట్‌లు, హెలికాప్టర్‌లు, ఆభరణాలు, హై ఎండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు, హై గ్లోస్ పేపర్, విటమిన్‌లు వంటి 35 వస్తువుల ధరలు పెరగవచ్చని అంచనా. నివేదికల ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచే అవకాశం ఉంది.

ఆర్థిక సర్వేలో 2023-24లో ఆర్థిక వృద్ధి రేటు 6 నుంచి 6.8 శాతంగా అంచనా వేయబడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో ఆర్థిక వృద్ధి రేటు 7 శాతంగా అంచనా వేయబడింది. గత ఏడాది.. 2021-22 ఆర్థిక సర్వే నివేదికను సమర్పించినప్పుడు 2022-23లో.. భారత ఆర్థిక వ్యవస్థ 8 నుండి 8.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్