24.2 C
Hyderabad
Friday, February 6, 2026
spot_img

ఎమ్మెల్సీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు

   పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. వరంగల్‌- ఖమ్మం- నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల ప్రచారం పై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం.

  వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో.. ఉపఎన్నిక అనివార్యమైంది. ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల్లో 4 లక్షల 61 వేల 806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో 2 లక్షల 87 వేల 007 మంది పురుషులు కాగా, 1లక్షల74వేల794 మంది మహిళలు, ఇతరులు ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం వివిధ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది పోటీ పడుతుండగా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, బీఆర్ఎస్‌ నుంచి ఏనుగుల రాకేశ్‌ రెడ్డి బరిలో నిలిచారు.

  వరంగల్‌- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది. తెలంగాణలో శాసనమండలి పునరుద్ధరణ అయిన నాటినుంచి ఈ స్థానంలో గులాబీ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు జరగనున్న ఉప ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ కీలక నేతలంతా రంగంలోకి దిగారు. ఇప్పటికే జిల్లాల్లో సమావేశాలు నిర్వహించడంతో పాటు మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కోపతాపాలుంటే పక్కకు పెట్టాలని, పార్టీ కోసం అందరూ కలిసి పని చేయాలని సూచించారు. అసంతృ ప్తులతో ఆయనే స్వయంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి గెలుపు కోసం ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. కేటీఆర్ సైతం స్వయంగా ప్రచారంలో పాల్గొంటు న్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయం కోసం తహతహలాడు తోంది. ఉద్యోగ, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలను వివరిస్తూ మండలిలో పట్టభద్రుల గళం వినిపిం చేందుకు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి గత ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని, మోడీ సర్కార్ యువత, ఉద్యోగుల కోసం ఎంతో చేసిందంటూ చెప్పుకొస్తున్నారు.

   కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. దీంతో పాటు ఖమ్మం – నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం లోని 32 అసెంబ్లీ స్థానాల్లో 30 స్థానాల్లో కాంగ్రెస్సే అధికారంలో ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ సైతం జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. మార్నింగ్ వాక్ లు, యువతతో మీటింగ్ లు నిర్వహిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అధికారంలో ఉన్న తమ పార్టీతోనే విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు. మొత్తంగా మూడు పార్టీలు ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్‌గా తీసుకొని ముందుకు సాగుతున్నాయి. పట్టభద్రుల ఏమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి పట్టభద్రులు ఎవ్వరికి పట్టం కడతారో.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్