మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నాయకుడు మహేష్‌పై కిట్టు అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఈ కేసులో మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేయగాపేర్ని కిట్టును ఏ1గా చేర్చారు పోలీసులు. ఏ1 కిట్టును మినహా మిగిలిన ఐదుగురిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వైసీపీ మహిళా నాయకురాలు నాగలక్ష్మి ఫిర్యాదుతో మహేష్, మరో ముగ్గురిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలో కులం పేరుతో తనను దూషించారని నాగలక్ష్మి స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.


