స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని ఆగ్రా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు కోసం రోడ్డు పక్కన నిలుచొని వేచి చూస్తున్న విద్యార్థులను.. అతివేగంతో వస్తున్న ఓ కారు ఢీకొట్టగా ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. వెంటనే చిన్నారులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం దౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం జరిగింది. బాద్యతారాహిత్యంగా చిన్నారులను కారు ఢీకొన్న ఘటనపై గ్రామస్థులు ఆగ్రహించారు. ఫతేహాబాద్- ఆగ్రా రహదారిని దిగ్బంధించి చిన్నారుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. గాయాల పాలైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. నిర్లక్ష్యంగా ఈ దారుణానికి ఒడిగట్టిన కారు డ్రైవర్ ను శిక్షించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు… కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గురిచేసిన కారును స్వాధీనం చేసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.