Telanganaa | రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్, చొప్పదండి సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని గుర్తించారు. ఈ క్రమంలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు పంటలు దెబ్బతిన్నాయో అంచనా వేసేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారికి సీఎం ఆదేశాలు జారీచేశారు. పంట నష్టం పోయిన జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి.. దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నివేదికలు తెప్పించాలని అధికారులకు సూచించారు.


