CM KCR | రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సీఎం కేసీఆర్. అల్లా ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా వుండాలని కోరినట్లు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలిసి మెలిసి జీవించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గంగా జమునా సంస్కృతికి తెలంగాణ నేల ఆలవాలమని అన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. గత తొమ్మిదేళ్లుగా ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చును బీఆర్ఎస్ సర్కారు చేసిందని పేర్కొన్నారు. ముస్లిం ప్రజలకు విద్యా, ఉపాధితో పాటు పలు రంగాల్లో తమ ప్రభుత్వం ఆసరాగా నిలిచిందని తెలిపారు. మైనారిటీల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ముస్లిం మైనారిటీ అభివృద్ధి మోడల్‌ను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.