Weather forecast | ఏపీకి నేడు వడగాల్పుల ముప్పు పొంచివుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 40 మండలాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అనకాపల్లి జిల్లాలో 14 మండలాలు, విజయనగరం జిల్లాలో 9 మండలాలు, గుంటూరు జిల్లాలో 7 మండలాలు, కాకినాడ జిల్లాలో 7 మండలాలు, కృష్ణా జిల్లాలో 4 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 4 మండలాలు, పల్నాడు జిల్లాలో 1 మండలాలు, విశాఖపట్నం జిల్లాలో 1 మండలం, అల్లూరి జిల్లాలో 1 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నందున ప్రజలు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప మధ్యాహ్నం బయటకు రావొద్దని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.